10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!

Date:

భారతీయ రైల్వేకు చెందిన రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (RCF) కపుర్తలాలో 734 యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక మెరిట్‌ ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండవు. అర్హులైన వారు సెప్టెంబరు 5, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..

భారతీయ రైల్వేకు చెందిన రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (RCF), కపుర్తలాలో భారీగా అప్రెంటిస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. కపుర్తలాలోని టెక్నికల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 734 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 సెప్టెంబరు 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టులు ఫిట్టర్‌, మెషినిస్ట్‌, పెయింటర్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌ తదితర ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత కూడా కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 సెప్టెంబరు 5 నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులు (PwBD) 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwBD), మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ అప్రెంటిస్‌ నియామకంలో అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండవు. పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితాను రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 సెప్టెంబరు 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు, వయోపరిమితి, ట్రేడ్‌ వారీగా ఖాళీలు, ఇతర నిబంధనలను పూర్తిగా పరిశీలించడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...