అరుదైన ఘటన.. 19 నిమిషాల్లో 33సార్లు కార్డియాక్ అరెస్ట్.. విజయవంతంగా స్టెంట్ వేసిన డాక్టర్లు, ప్రాణాలు దక్కాయి

Date:

ఛాతీలో మంట, నొప్పిని గ్యాస్‌గా భావిస్తే చాలా డేంజర్. ఓ ప్రొఫెసర్ గుండెనొప్పిని గ్యాస్‌గా భావించి ఇబ్బందిపడ్డారు. వెంటనే ఆయన ఆస్పత్రిలో చేరగా.. గుండె రక్తనాళంలో 100 శాతం బ్లాక్‌ అయ్యింది. వెంటనే ఆయనకు స్టెంట్ వేసే ప్రక్రియ చేపట్టగా.. చికిత్స అందిస్తున్న సమయంలో ఏకంగా 33 సార్లు కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. డాక్టర్లు అత్యవసర వైద్యం అందిస్తూ ఆయన ప్రాణాలు కాపాడారు.

ఛాతిలో మంట, నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు డాక్టర్లు. విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ అరుదైన ఘటన గురించి ప్రస్తావించారు. ఓ వ్యక్తి గుండెనొప్పిని గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి మందులతో సరిపెట్టారు.. అయినా తగ్గరకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు 33సార్లు కార్డియాక్ అరెస్ట్‌కు గురికాగా.. డాక్టర్లు అత్యవసర వైద్యంతో ప్రాణాలు కాపాడారు. ఏపీలోని ఓ యూనివర్శిటీలో డీన్‌గా, విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న విజయ్‌రామ్ జులై 30న గుండెనొప్పితో బాధఫడ్డారు. ఆయన గ్యాస్ట్రిక్ అనుకుని దగ్గరలో ఉన్న డాక్టర్‌ను కలిసి మందులు తీసుకున్నారు.

ఆయన మందులు తీసుకున్నా సరే అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో మళ్లీ ఇబ్బందిపడ్డారు.. వెంటనే ఆయన విజయవాడలోని రమేష్‌ హాస్పిటల్స్‌కు వెళ్లారు. విజయ్‌రామ్‌ ఆస్పత్రికి వచ్చిన రెండు నిమిషాల్లోకార్డియాక్‌ అరెస్ట్‌, వీఎఫ్‌ (వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌)తో ఇబ్బందిపడ్డారు. వెంటనే ఆస్పత్రిలోని డాక్టర్లు కరెంట్ షాక్ ఇచ్చి వెంటిలేటర్‌పై ఉంచారు. యాంజియోగ్రామ్‌లో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ఎల్‌ఏడీ ధమని 100% పూడుకుపోయినట్లు తేల్చారు. అత్యవసరంగా స్టెంట్‌ యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ఆయనకుస్టెంట్‌ అమర్చే ప్రక్రియలో 33సార్లు కార్డియాక్ అరెస్ట్ కావడంతో డీసీ షాక్‌ ఇచ్చారు. డాక్టర్ల టీమ్ అప్రమత్తంగా వ్యవహరించి సర్జరీ కొనసాగించారు.

విజయ్‌రామ్ ఆసుపత్రికి వచ్చిన 19 నిమిషాల్లోనే స్టెంట్‌ అమర్చే ప్రక్రియ పూర్తి చేయడంతో రక్తప్రసరణ జరిగింది. ఆయనకు 48 గంటల్లో ఐఏబీపీని తొలగించగా.. నాలుగో రోజు రోగి నడిచారు. ఛాతిలో మంట, నొప్పి వస్తే గ్యాస్ట్రిక్ అనుకుని నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్ రమేష్‌బాబు తెలిపారు. ఛాతీలో నొప్పి, బరువు, ఒత్తిడి, చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే ఈసీజీ చేయించుకుని కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు. వీలుంటే కార్డియాక్‌ సదుపాయాలున్న ఆసుపత్రికి వెళ్లడం మంచిదన్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో ప్రతి నిమిషం చాలా కీలకమని.. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి నియంత్రణలో ఉండలన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయాలని.. నిరంతరం గుండెకు సంబంధించి టెస్ట్‌లు చేయించుకోవాలన్నారు. విజయ్‌రామ్ కేసులో గుండె రక్తనాళంలో 100 శాతం బ్లాక్‌ను గుర్తించామని.. 19 నిమిషాల్లోనే అత్యవసర స్టెంట్‌ యాంజియోప్లాస్టీ నిర్వహించామన్నారు. స్టెంట్ వేసే సమయంలో ఆయన 33సార్లు కార్డియాక్ అరెస్ట్2కు గురయ్యారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...