7,437 పోలీస్ ఉద్యోగాలు.. అప్లికేషన్ తేదీలు రిలీజ్.. ఎస్సైకి రూ.1500, కానిస్టేబుల్‌కు రూ.1200 ఫీజు

Date:

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఇటీవలె 7437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన రాగా.. తాజాగా ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే తేదీలను ఖరారు చేశారు. ఈనెల 19 నుంచి వచ్చే నెల 9 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. కానిస్టేబుల్, ఎస్‌ఐ, ఫైర్‌ఫైటర్, వార్డర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఎస్సై పోస్టుకు రూ.1500, కానిస్టేబుల్ పోస్టుకు రూ.1200 చొప్పున అప్లికేషన్ ఫీజు నిర్ణయించారు.

ఇటీవల పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్), అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి 4 వేర్వేరు నోటిఫికేషన్లను టీఎస్ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో అత్యధికంగా కానిస్టేబుల్ పోస్టులే ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) 3,697.. ఏఆర్ కానిస్టేబుల్ 1,052.. ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ 1,380.. ఫైర్ ఫైటర్ 751.. జైలు వార్డర్ 208 పోస్టులు ఉండగా.. సబ్ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఏఎస్సై వంటి పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగానే ఫిజికల్, మెడికల్ రూల్స్‌ చెక్ చేసుకోవాలని టీఎస్ఎల్‌పీఆర్‌బీ అధికారులు సూచించారు. అలాగే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రీమీలేయర్, స్థానికత, ఇతర ప్రత్యేక కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఆయా సర్టిఫికెట్లను రెడీగా ఉంచుకోవాలని తెలిపింది.

ఇక.. పరీక్ష ఫీజును ఎస్‌ఐ స్థాయి పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.750.. ఇతర అభ్యర్థులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. కానిస్టేబుల్, ఫైర్‌ఫైటర్, వార్డర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీలకు రూ.600.. ఇతరులకు రూ.1,200గా ఫీజు నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు www.tgprb.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ఎల్‌పీఆర్‌బీ సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...