పాయకాపురం, రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా సీట్లు కేటాయిస్తూ, ఎస్సీ సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకులు కోరారు. ఈ మేరకు విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బొండా ఉమామహేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు.

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలోని ఒక డివిజన్‌ను ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన నందేటి ప్రేమ్‌కు కేటాయించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి తమ అభ్యర్థనను వివరించారు.

మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి విజయవాడ అర్బన్‌ ప్రతినిధి లింగాల నరసింహులు మాదిగ ఆధ్వర్యంలో ఈ వినతిపత్రాన్ని సమర్పించారు. రానున్న ఎన్నికల్లో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తూ, రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం సీట్ల కేటాయింపు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కంపాటి వెంకటేశ్వరరావు, బొడ్డు కిషోర్‌, చెప్పిడి కాశీ, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *