విజయవాడ ఇంద్రకీలాద్రిలో ముగిసిన శాకంబరీ ఉత్సవాలు..

Date:

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ తల్లి శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజున అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శాకంబరీ ఉత్సవాల సందర్భంగా మూలవిరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్‌తో ప్రత్యేకంగా అలంకరించారు.

ప్రకృతి సంపదను ప్రతిబింబించేలా చేసిన ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇంద్రకీలాద్రి మొత్తం ‘జై దుర్గా.. జై జై దుర్గా’ నామస్మరణతో మార్మోగింది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరీ ఉత్సవాల వెనుక ప్రత్యేక ఆధ్యాత్మిక విశ్వాసం ఉందని భక్తులు చెబుతున్నారు. సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, దేశం సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ప్రకృతి, వ్యవసాయం, ఆహార సంపదకు ప్రతీకగా శాకంబరీ దేవిని కొలుస్తారని చెప్పుకొచ్చారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో ప్రత్యేకంగా కదంబ ప్రసాదాన్ని తయారు చేశారు. ఈ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. కదంబ ప్రసాదాన్ని స్వీకరిస్తే అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని భక్తులు చెబుతున్నారు. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలతో సాగిన శాకంబరీ ఉత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...