గంజాయి నిర్మూలనకు పోలీసుల ప్రత్యేక చర్యలు..

Date:

గంపలగూడెం, ఆగస్టు 25 ఈగల్‌ 2.0 కార్యక్రమంలో భాగంగా గంపలగూడెం మండలంలో గంజాయి వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి సేవిస్తున్నట్లు అనుమానించిన 25 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు ఎస్సై జి.అనిల్ తెలిపారు. పరీక్షల్లో ముగ్గురికి గంజాయి వినియోగం పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.

పాజిటివ్‌గా తేలిన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై దాని ప్రభావం, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించినట్లు ఎస్సై తెలిపారు.

యువత గంజాయి సహా అన్ని రకాల మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంతో పాటు కుటుంబ జీవితం, విద్య, ఉద్యోగం, సామాజిక సంబంధాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు గురికాకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మండల పరిధిలో ఎవరైనా గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై జి.అనిల్ కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమాచారం అందించిన వారికి నగదు బహుమతి కూడా అందజేస్తామని వెల్లడించారు.

మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాస్‌వర్డ్ కంటే ఇదే సేఫ్‌.. స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీపై అసలు నిజం ఇదే!

స్మార్ట్‌ఫోన్‌కు సురక్షితమైన స్క్రీన్ లాక్ ఏది? స్మార్ట్‌ఫోన్‌ నేడు మన రోజువారీ జీవితంలో...

షూటింగ్‌కు వెళ్లి బయటకు పంపారు.. అదే ఇంటిని సొంతం చేసుకున్న కింగ్ ఖాన్!

ముంబై బాంద్రా బ్యాండ్‌స్టాండ్ వద్ద సముద్రాన్ని చూస్తూ ఉండే ‘మన్నత్’ అంటే...

నానబెట్టిన బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. అసలు కారణం ఇదే!

బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీసి తినడం...

మళ్లీ తెర పైకి జమిలి!

హైదరాబాద్‌, ఆగస్టు 24: 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎన్డీయే పాలనలో...