ఏపీ టీచర్లకు గుడ్‌న్యూస్‌.. స్పెషల్‌ టెట్‌ షెడ్యూల్‌ విడుదల

Date:

ఏపీ టీచర్లకు గుడ్‌న్యూస్‌.. స్పెషల్‌ టెట్‌ షెడ్యూల్‌ విడుదల

అమరావతి,  ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (స్పెషల్‌ టెట్‌) నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. టెట్‌ అర్హత సాధించేందుకు ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.

స్పెషల్‌ టెట్‌లో అర్హత సాధించడం ద్వారా ఉపాధ్యాయులు తమ వృత్తి ప్రయాణాన్ని మరింత ఆత్మవిశ్వాసంతో కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. అర్హత కలిగిన ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరీక్షకు సమర్థంగా సిద్ధమయ్యేందుకు మాక్‌ టెస్టులను సాధన చేయాలని కోరారు.

స్పెషల్‌ టెట్‌ ముఖ్య తేదీలు

  • నోటిఫికేషన్‌ విడుదల: ఆగస్టు 24, 2026
  • దరఖాస్తుల స్వీకరణ: ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 24, 2026 వరకు
  • పరీక్ష నిర్వహణ: అక్టోబర్‌ 11 నుంచి 21, 2026 వరకు

స్పెషల్‌ టెట్‌కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌, మార్గదర్శకాలు cse.ap.gov.intet2dsc.apcfss.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని లోకేశ్‌ తెలిపారు.

ఉపాధ్యాయులను మరింత బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో నాణ్యమైన విద్యా వ్యవస్థకు పటిష్ఠమైన పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాస్‌వర్డ్ కంటే ఇదే సేఫ్‌.. స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీపై అసలు నిజం ఇదే!

స్మార్ట్‌ఫోన్‌కు సురక్షితమైన స్క్రీన్ లాక్ ఏది? స్మార్ట్‌ఫోన్‌ నేడు మన రోజువారీ జీవితంలో...

షూటింగ్‌కు వెళ్లి బయటకు పంపారు.. అదే ఇంటిని సొంతం చేసుకున్న కింగ్ ఖాన్!

ముంబై బాంద్రా బ్యాండ్‌స్టాండ్ వద్ద సముద్రాన్ని చూస్తూ ఉండే ‘మన్నత్’ అంటే...

నానబెట్టిన బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. అసలు కారణం ఇదే!

బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీసి తినడం...

మళ్లీ తెర పైకి జమిలి!

హైదరాబాద్‌, ఆగస్టు 24: 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎన్డీయే పాలనలో...