పెనమలూరు, తాడిగడప మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పుణేఠా గురువారం పరిశీలించారు. కానూరులోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న తీరును పరిశీలించారు.

ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ సూచించారు. ఈ పర్యటనలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *