టార్గెట్ 2029.. వైసీపీ వ్యూహం మార్చిందా.. జగన్ నినాదం వెనుక వ్యూహమదేనా?

Date:

వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైసీపీ వ్యూహం మార్చిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వైసీపీ నేతల వ్యాఖ్యలతో పాటే, నిరసనలు, ఆందోళనల్లో వినిపిస్తున్న ఆ పేరే.. దీనికి బలం చేకూరుస్తోంది. తాజాగా డీఎస్సీ అక్రమాలపై చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌లోనూ ఇదే పదం కనిపించడంతో.. రాజకీయ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చిందా.. ఢిల్లీ ప్రభావం ఏపీలోని గల్లీపైనా పడిందా.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఢిల్లీ వేదికగా సాగిన జెన్ జీ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. చివరకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామాచేయించింది కూడా. ఈ ఉద్యమంతో రాజకీయాల్లో జెన్ జీ పాత్ర ఏమిటనే దానిపై పొలిటికల్ పార్టీలకు ఓ క్లారిటీ వచ్చింది. దీంతో అన్ని పార్టీలు కూడాజెన్ జీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారి సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి.

ఈ క్రమంలోనే ఏపీలోని యువతరాన్ని తమవైపు ఆకర్షించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. యువత, విద్యార్థుల సమస్యలను లేవనెత్తుతోంది. నీట్ తరహాలోనే ఏపీలో డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆరోపిస్తోంది. జెన్ జీ ఉద్యమం ముందు వరకూ డీఎస్సీలో అక్రమాలపై వైసీపీ సాగించిన పోరాటం.. ప్రధాన్ రాజీనామా అనంతరం దేశవ్యాప్తంగా మారిన పరిస్థితుల కారణంగా కొత్త రూపు తీసుకుంది. వైసీపీ చేసే నిరసన కార్యక్రమాలు, ఆందోళనలలోనూ జెన్ జీ పేరును వైసీపీ నేతలు ఎక్కువగా ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల పొగాకు రైతులను పరామర్శించేందుకు తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లిలో పర్యటించారు.

జగన్ పర్యటనకు జెన్ జీల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని… యువతరం పెద్ద సంఖ్యలో జగన్ కార్యక్రమానికి హాజరయ్యారని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు డీఎస్సీ అక్రమాలపై వైసీపీ చేపడుతున్న రిలే నిరాహార దీక్షల వద్ద జెన్ జీ ప్రస్తావన తేవడం మారిన వైసీపీ స్ట్రాటజీకి నిదర్శనమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల వైసీపీ పోస్టర్లపై AP GEN – Z War అంటూ ముద్రిస్తుండటం గమనార్హం. తాజాగా వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌తో వైసీపీ వ్యూహం మారిందనే క్లారిటీ వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...