
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ ప్రభాకర్ నాయుడు అనారోగ్యంతో కన్నుమూశారు. పేద, నిరుపేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ ఆయన విశేష సేవలు అందించారు. వైద్యరంగంలో లక్షకు పైగా శస్త్రచికిత్సలు నిర్వహించి పలు రికార్డులు సృష్టించారు.
ప్రభాకర్ నాయుడు మృతిపట్ల ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్యరంగంలో ఆయన అందించిన సేవలు, ప్రజల పట్ల చూపిన ఆత్మీయత, మానవత్వం చిరస్మరణీయమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రభాకర్ నాయుడుతో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్న ఆమె ఆయన మృతి వ్యక్తిగతంగా, ప్రజలకు తీరని లోటని అన్నారు.
మున్సిపల్ ఛైర్మన్గా, వైద్యుడిగా ప్రభాకర్ నాయుడు అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించిన ఆయన సేవలను కొనియాడారు. ప్రభాకర్ నాయుడు మృతి పట్ల పలువురు రాజకీయ, ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
