మధ్యాహ్న భోజనం బాలేదు..కాదు బాగుంది

Date:

ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు (ఫీడ్‌ బ్యాక్‌) సేకరించేందుకు చేపట్టిన ఐవీఆర్‌ ఎస్‌ కాల్స్‌ గురువారం జిల్లా విద్యాశాఖలో కొంత కలవరం పుట్టించాయి.

ఏలూరు అర్బన్‌, ఆగస్టు 6(ఆంధ్రజ్యో తి): ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు (ఫీడ్‌ బ్యాక్‌) సేకరించేందుకు చేపట్టిన ఐవీఆర్‌ ఎస్‌ కాల్స్‌ గురువారం జిల్లా విద్యాశాఖలో కొంత కలవరం పుట్టించాయి. ఈ పథకంపై జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆర్టీజీఎస్‌ (రియల్‌ టైం గవర్నెన్స్‌ సిస్టం)ద్వారా ర్యాండమ్‌గా అభిప్రాయ సేకరణ జరిపారు. జంగారెడ్డిగూడెం (బాలికలు), ముదినేపల్లి జడ్పీ హైస్కూళ్లు, ఏలూరులోని దక్షిణపు వీధి మున్సిపల్‌ హైస్కూలులో ఆహార పదార్థాలు రుచికరంగా లేవని, చిక్కీలు, కోడిగుడ్లు నాణ్యత లేవని కొందరు తల్లిదం డ్రుల నుంచి ఫిర్యాదు లందాయి. ఈ విష యాన్ని ఆర్టీజీఎస్‌ నుంచి జిల్లా విద్యాశాఖ కు చేరవేయగా మండలాల ఎంఈవోలకు సమాచారాన్ని పంపించి, ఆయా పాఠశాల ల హెచ్‌ఎంల నుంచి వివరణ తీసుకోవా లని ఆదేశించింది. ఫిర్యాదు చేసిన తల్లిదం డ్రుల పిల్లలు ఏ క్లాసులో చదువుతున్నదీ గుర్తించి, వారినుంచి ఆహార పదార్థాల నాణ్యత, తదితర అంశాలపై హెచ్‌ఎంలు అడిగి తెలుసుకుని లిఖిత పూర్వకంగా వివ రణలను జిల్లా విద్యాశాఖకు పంపించారు. అదే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రు లతో మాట్లాడారు. ప్రభుత్వం రూపొందిం చిన ‘లీప్‌’ యాప్‌ను ఓపెన్‌ చేసిన వెంటనే భోజన పథకం గురించి ఫీడ్‌బ్యాక్‌ అడిగా రని, నాణ్యత విషయంలో అభిప్రాయం చెప్పడానికి ఒకటి, రెండు నంబర్లు నొక్క మనగానే వాటి గురించి తెలియక ఏదోఒక నంబరును నొక్కేసామని పలువురు పేరెం ట్స్‌ హెచ్‌ఎంలు, ఎంఈవోలకు వివరించా రు. ఇదే సమాచారాన్ని హెచ్‌ఎంలు లిఖిత పూర్వకంగా తీసుకుని జిల్లా విద్యాశాఖకు పంపడంతో ఉదయం నుంచి వేడెక్కిన వాతావరణం మధ్యాహ్నానికి చల్లబడింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...