బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలలో భారీ వానలు.. విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..

Date:

ఏపీలో వచ్చే రెండురోజులు పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రెండు రోజులు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, మరికొన్నిచోట్ల మోస్తరు వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. శనివారం నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాల్లో మేఘావృతమైన వాతావరణంతోపాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

మరోవైపు శుక్రవారం రాత్రి పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సాలూరు, బొబ్బిలి, ఎస్‌కోట, విజయనగరం, రాజాం పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని సూచించింది. మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

మరోవైపు గురువారం రాత్రి విశాఖపట్నంలో భారీ వర్షం కురిసింది. పిడుగులతో కూడిన భారీ వర్షం కురవటంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీట మునిగి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గోపాలపట్నంలోని బుచ్చిరాజుపాలెంలో అత్యధికంగా 95 మి.మీ. వర్షం కురిసింది. గాజువాక, రైల్వే న్యూకాలనీ, వేపగుంట, సింహాచలం, పెందుర్తి, ఎంవీపీ కాలనీ ఇలా చాలాచోట్ల భారీ వర్షం కురవటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రోడ్లపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...