90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్షను నెరవేర్చిన సీఎం చంద్రబాబు.

Date:

ఓ వృద్ధురాలి ఆకాంక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. తనను కలిసి ఫొటో దిగాలన్న ఆ వృద్ధురాలి కోరికను ఆయన తీర్చారు. అలాగే ఇదే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ చేనేత కుటుంబాన్ని ఆయన కలిశారు.

ఓ వృద్ధురాలి ఆకాంక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. తనను కలిసి ఫొటో దిగాలన్న ఆ వృద్ధురాలి కోరికను ఆయన తీర్చారు. ఇదే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ చేనేత కుటుంబాన్నీ ముఖ్యమంత్రి కలిశారు. ఇటీవల చీరాలకు చెందిన పుష్పావతి అనే వృద్ధురాలు సీఎం చంద్రబాబును కలవాలనే తన ఆకాంక్షను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అయ్యింది.

ఆ వీడియో కాస్తా సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో వృద్ధురాలి ఆకాంక్షను నెరవేర్చాలని భావించారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం నాడు ఆమెను చీరాలలో కలిసి మాట్లాడతానంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ మేరకు నేడు చీరాలలో తన అభిమాని అయిన ఆ వృద్ధురాలిని ముఖ్యమంత్రి కలిశారు. ఆప్యాయంగా పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె కోరిక మేరకు ఫొటో దిగారు. సీఎం చంద్రబాబుతో ఫొటో దిగడంపై ఆ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. జీవితకాల కోరిక నెరవేరిందంటూ సంబరపడ్డారు.

మరోవైపు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన చేనేత కుటుంబం నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులను కూడా సీఎం చంద్రబాబు కలిశారు. వారి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చేనేత దినోత్సవం రోజు కలుస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం వారిని నేడు చీరాలలో ముఖ్యమంత్రి కలిశారు. ఈ సందర్భంగా మగ్గంతో నేసిన ఆయన చిత్రపటాన్ని వారు చంద్రబాబుకు బహూకరించారు. దానిని పరిశీలించిన ఆయన.. ఎంతో నైపుణ్యంతో తన చిత్రపటాన్ని వస్త్రంపై నేసిన చేనేత దంపతులను అభినందించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...