నర్సాపురం, గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు, కొవ్వలి ఫౌండేషన్‌ చైర్మన్‌ కొవ్వలి యతిరాజ రామ్మోహన్‌ నాయుడికి వీఆర్‌ఏ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.

గురువారం ఆయన నివాసంలో వీఆర్‌ఏ ప్రతినిధులు కలిసి తమ సమస్యలను వివరించారు. న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 25 రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికలు, వరదలు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో రెవెన్యూ శాఖ ద్వారా అందించిన సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. వీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు చేయడంతో పాటు అర్హులకు గ్రేడ్‌-2 వీఆర్‌వోలుగా పదోన్నతులు కల్పించాలని, నామినీ వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.

వీఆర్‌ఏల సమస్యలపై కొవ్వలి నాయుడు సానుకూలంగా స్పందించారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *