Weather Alert: రేపట్నుంచే ఉక్కపోత మార్చి 1 నుంచి మాడు పగిలే ఎండలతో హఢల్!

Date:

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని మాఠ్వాడా వరకు వ్యాపించి ఉన్న ద్రోణి వాయువ్య దిశగా కదులుతుంది. దీని ప్రభావంతో శుక్రవారం సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని.

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని మాఠ్వాడా వరకు వ్యాపించి ఉన్న ద్రోణి వాయువ్య దిశగా కదులుతుంది.

దీని ప్రభావంతో శుక్రవారం సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్జ్‌ జారీ చేసింది. ణి ప్రభావంతో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.

గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో 4.36 సెంటీమీటర్ల మేర అత్యధిక వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో అత్యల్పంగా 1.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సిద్దిపేట, వికారాబాద్‌, వరంగల్‌, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి వంటి పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.

ఈ అకాల వర్షాలకు రైతులు దారుణంగా నష్టపోతున్నారు. పలు జిల్లాల్లో మొక్కజొన్న, శనగ, జొన్న పంటలు నేలకొరిగాయి. గింజ పాలు పోసుకునే దశలో మొక్కజొన్న నేలవాలడంతో ఎదుగుదల కష్టమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో శుద్ధి చేసి ఆరబెట్టిన పసుపు గాలివానకు తడిసిపోయింది.

అయితే శనివారం నుంచి వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఉక్కపోతలు కూడా రేపట్నుంచి మొదలవుతాయని వాతావరణ కేంద్రం వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21గా నమోదవుతున్నాయి. మార్చి 1 నుంచి ఎండలు మండిపోతాయని జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...