గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రమోషన్లపై మంత్రి కీలక ప్రకటన

Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పేరు మార్పు బిల్లును మంత్రి స్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ కార్యలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవల్ని అందిస్తున్నామని.. స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి స్వామి. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేరును గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయాలుగా మార్పునకు సంబంధించిన సవరణ బిల్లును రాష్ట్ర గ్రామ, వార్డు స్వర్ణశాఖ మంత్రి శ్రీబాల వీరాంజనేయస్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభలో ఆమోదం పొందిన తర్వాత మంత్రి కీలక ప్రకటన చేశారు. గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయాల్లో ఉద్యోగుల విధులు, బాధ్యతలపై గందరగోళాన్ని తొలగించామన్నారు మంత్రిస్వామి. ప్రభుత్వం జిల్లా, మండల, మున్సిపల్‌ స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు. అంతేకాదు గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయాల్లోని అన్ని విభాగాల ఉద్యోగులకు పదోన్నతులు (ప్రమోషన్లు) కల్పిస్తామని తెలిపారు.

పనిచేసే ఉద్యోగుల్లో అర్హులైన వారందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారన్నారు. గత 19 నెలల్లో గ్రామ, వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా వ్యవస్థలో ఎన్నో మార్పులు చేశామన్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయాలను జనాభాకు తగిన విధంగా వర్గీకరించామన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...