రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!

Date:

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి లోపే అర్హులైన రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నిధులను జమ చేయనుంది. సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందేలా శాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతతో కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. దీని ద్వారా అనర్హులను తొలగించి, ప్రజాధనాన్ని వృథా కాకుండా కాపాడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

తెలంగాణలోని  అందించింది. సంక్రాంతి పండుగ లోపే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లో ‘ రైతు భరోసా ‘ నిధులను జమ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు తమ కసరత్తును ముమ్మరం చేశాయి. ఈసారి గతానికి భిన్నంగా.. కేవలం వాస్తవంగా సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమలు చేస్తోంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలో అనేక లోపాలు ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. సాగుకు పనికిరాని కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కమర్షియల్ ప్లాట్లకు కూడా గతంలో పంట పెట్టుబడి సాయం అందేవి. ఈ వృథాకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ‘సింథటిక్ ఎపర్చర్ రాడార్’ (SAR) శాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతను వాడుతోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ శాటిలైట్ సర్వే సత్ఫలితాలను ఇవ్వడంతో, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దీని ఆధారంగానే అనర్హులను తొలగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏఈవోలు ఈ నివేదికల ఆధారంగా నిజమైన రైతులను గుర్తిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...