టీమిండియా ఈజ్ బ్యాక్.. చెపాక్‌లో చితక్కొట్టుడు కొట్టిన బ్యాటర్లు..!

Date:

టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా బ్యాటర్లు జూలు విదిల్చారు. జింబాబ్వేతో మ్యాచ్‌లో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తమ అత్యధిక స్కోరు నమోదు చేశారు. చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లు సైతం మెరుగైన ప్రదర్శన చేశారు.

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8లో జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మోస్తరు ప్రదర్శన చేసిన టీమిండియా బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో మాత్రం సత్తాచాటారు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. అభిషేక్ శర్మ సహా ఇతర బ్యాటర్లంతా తలా ఓ చేయి వేయడంతో టీమిండియా రికార్డు స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా.. భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఇక ఈ మ్యాచ్‌ ద్వారా తుది జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్.. మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ సైతం కుదురుకున్నాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 22 బంతుల్లో 48 రన్స్ జోడించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..

యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది....

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్.. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్...

ఆరుగురిని చంపిన హంత‌కుడికి అనాథ‌లా అంత్య‌క్రియ‌లు.. కుటుంబ సభ్యులు వద్దనడంతో.. ఎవరు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఆరుగురుని అతికిరాతకంగా చంపిన కిరాతక...

సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు.. ఏడాది జైలుశిక్ష పడే అవకాశం ఉందా?

రాష్ట్రంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా.....