
సోషల్ మీడియాలో ప్రముఖ నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ చేసిన మరో పోస్ట్ వైరల్‌గా మారింది. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, టైమ్‌పాస్ కోసం కొందరు తన పేరును ఉపయోగిస్తూ తన జీవితానికి అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి పదవులు, హోదాలపై వ్యామోహం లేదని స్పష్టం చేశారు.
అయితే బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్నది మాత్రం తన పోస్ట్‌లో వెల్లడించలేదు. దీంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరోవైపు, నెటిజన్లు మాత్రం ఈ పోస్టుపై తమదైన శైలిలో స్పందిస్తూ, బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారంటూ చర్చించుకుంటున్నారు.
ప్రముఖ నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన చేసిన ఎమోషనల్ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. “చేతులెత్తి మొక్కుతున్నా.. నన్ను వదిలేయండి” అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? ఏ సందర్భంలో ఈ ట్వీట్ చేశారు? అనే విషయాలపై మాత్రం స్పష్టత లేదు.
బండ్ల గణేష్ అసలేం చెప్పారు?
తన పేరును ఉద్దేశపూర్వకంగా అనవసరమైన చర్చల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ బండ్ల గణేష్ సోమవారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తనకు రాజకీయ పదవులు, ఇతర హోదాలపై ఎలాంటి ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా సరదా కోసం తన పేరును ఉపయోగించుకుంటూ తనకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “నాకు ఏ పదవులపైనా, హోదాలపైనా వ్యామోహం లేదు. దయచేసి లేనిపోని వ్యవహారాల్లో నా పేరును లాగి ఇబ్బందుల పాలు చేయొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నాను” అంటూ బండ్ల గణేష్ విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయాన్ని మాత్రం ఆయన తన పోస్టులో వెల్లడించలేదు. దీంతో బండ్ల గణేష్ ట్వీట్‌పై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. ఆయన అసలు ఉద్దేశం ఏమిటన్నది తెలియాలంటే మరింత స్పష్టత రావాల్సి ఉంది.
కొంతకాలంగా ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు త్వరలోనే ఏదో ఒక రాజకీయ పదవి లేదా నామినేటెడ్ పోస్టు దక్కబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ, జనసేన పార్టీలతో ఆయన సన్నిహితంగా మెలుగుతుండటం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.
ముఖ్యంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని బండ్ల గణేష్ పలుమార్లు బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఇటీవల బండ్ల గణేష్ కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్‌ను పొగుడుతున్నారంటూ పేర్ని కిట్టు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. “త్వరలోనే పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో, ఆయన స్థానం ఏమిటో అర్థమయ్యేలా చెబుతా తమ్ముడూ..” అంటూ సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు.
ఇక ఇటీవల జరిగిన బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి హాజరుకావడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే బండ్ల గణేష్‌కు త్వరలోనే కీలకమైన రాజకీయ బాధ్యత దక్కే అవకాశం ఉందనే చర్చ మరింత ఊపందుకుంది.
