గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి

తిరుపతి, తిరుపతి శ్రీసిటీలో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వారు త్వరగా కోలుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, తగిన సహాయం అందించాలని వైఎస్‌ జగన్‌ కోరారు.

By Ramya