
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌తో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి చెన్నై వెళ్లిన ఆమె.. సీఎం కార్యాలయంలో విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహానికి హాజరుకావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.
వచ్చే నెల నవంబర్ 25న జరగనున్న వివాహ వేడుకకు సంబంధించిన పెళ్లి పత్రికను సీఎం విజయ్‌కు అందజేశారు. కుటుంబ సమేతంగా వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని షర్మిల దంపతులు కోరారు.
ఈ భేటీకి సంబంధించిన వివరాలను వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ ఆహ్వానాన్ని స్వీకరించి, ఆప్యాయంగా కలిసిన సీఎం విజయ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులకు విజయ్ శుభాకాంక్షలు తెలియజేసినట్లు షర్మిల పేర్కొన్నారు.
