అందంగా ఉందని పెళ్లి చేసుకున్న యువకుడు.. 25 రోజులకు బయటపడ్డ వధువు అసలు రూపం..!

Date:

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ని షాజాపూర్ జిల్లాలో సంచలనం రేపిన ఓ వివాహ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగిన 25 రోజుల తర్వాత తమ కోడలు ట్రాన్స్‌జెండర్ అని తెలిసిందంటూ వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ని షాజాపూర్ జిల్లాలో సంచలనం రేపిన ఓ వివాహ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగిన 25 రోజుల తర్వాత తమ కోడలు ట్రాన్స్‌జెండర్ అని తెలిసిందంటూ వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, షాజాపూర్‌కు చెందిన ఓ యువకుడు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వివాహం ఆలస్యం కావడంతో, పరిచయస్తుల ద్వారా రాజ్‌గఢ్ జిల్లా పచోర్‌కు చెందిన కుటుంబంతో సంబంధం కుదిరింది. జూన్ 29న స్థానిక ఆలయంలో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి ఏర్పాట్లు, ఇతర ఖర్చుల కోసం సుమారు రూ. 5 లక్షలు, అదనంగా రూ. 1 లక్ష నగదు ఖర్చు చేసినట్లు వరుడి కుటుంబం ఆరోపిస్తోంది

వివాహం అనంతరం జూన్ 30న వధువు అత్తగారింటికి చేరుకుంది. అయితే మొదటి రాత్రే తనకు నెలసరి వచ్చిందని చెప్పిందని, అనంతరం ఆరోగ్యం బాగోలేదని చెబుతూ జూలై 2న పుట్టింటికి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు మూడు వారాల తర్వాత జూలై 23న తిరిగి అత్తగారింటికి వచ్చిన ఆమె ప్రవర్తనపై కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ముఖానికి షేవింగ్ క్రీమ్ పూసుకోవడం, ఇతర ప్రవర్తనలో తేడాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, ఆమె ట్రాన్స్‌జెండర్ అని తెలుసుకున్నట్లు వారు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తాము పథకం ప్రకారం మోసపోయామని ఆరోపిస్తూ షాజాపూర్ కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...