ఇంటి నుంచి పిలిచి.. వెంటాడి వేటాడారు.. సుహాస్ మృతి కేసులో వెలుగులోకి భయంకర నిజాలు..!

Date:

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని పసుమాములలో రెండు రోజుల క్రితం జరిగిన యువకుడు సుహాస్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును.. పోలీసులు ప్రస్తుతం హత్య కేసుగా మార్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని పసుమాములలో రెండు రోజుల క్రితం జరిగిన యువకుడు సుహాస్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును.. పోలీసులు ప్రస్తుతం హత్య కేసుగా మార్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. అర్థరాత్రి దాటిన తర్వాత స్నేహితులే సుహాస్‌ను ఇంటి నుంచి పిలుచుకుని వెళ్లారు. ఆ తర్వాత అతను తిరిగి రాలేదు. ఒక యువతికి సంబంధించిన వ్యవహారం, అలాగే పాత ఆర్థిక వివాదాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు సుహాస్‌ను గ్రామ శివారులోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. వారి బారి నుంచి తప్పించుకునేందుకు సుహాస్ పరుగు తీసినప్పటికీ, నిందితులు వెంటాడి మరీ పట్టుకుని దారుణంగా హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనంతరం ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని స్థానిక శ్మశానవాటిక సమీపంలో పడేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్న కొందరు అనుమానితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. స్నేహితులే ప్రాణాలు తీశారనే వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...