ఏఐ రేసులో దూసుకెళ్తున్న AP.. టీసీఎస్- ఓపెన్ ఏఐ డేటా సెంటర్ డీల్.. వైజాగ్‌లో 200 ఎకరాలు కేటాయింపు!

Date:

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్‌ఏఐటాటా గ్రూప్ భాగస్వామ్యంలో భారత్‌లో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా (విశాఖపట్నం సమీపంలో) టీసీఎస్‌కు 200 ఎకరాల భూమిని కేటాయించినట్లు సమాచారం.

ఇప్పటికే అదే ప్రాంతంలో గూగుల్ తన మెగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను నిర్మిస్తోంది. ఇప్పుడు టీసీఎస్-ఓపెన్‌ఏఐ ప్రాజెక్ట్ కూడా అందులో చేరితే విశాఖ–అనకాపల్లి ప్రాంతం దేశంలోని కీలక ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏఐ కంప్యూటింగ్, క్లౌడ్ సేవలు, డేటా స్టోరేజ్ వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వం, బ్యాంకింగ్, టెలికాం, హెల్త్‌కేర్ వంటి రంగాలకు అవసరమైన ఏఐ సేవలను దేశీయంగా అందించడమే లక్ష్యంగా టాటా గ్రూప్ ముందుకు సాగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి కొత్త ఊపు లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఏపీలో మహిళలకు అద్భుత అవకాశం.. ‘చాయ్‌రాస్తా’లతో ప్రతి నెలా రూ.40వేల వరకు ఆదాయం, దరఖాస్తు చేస్కోండి

మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు వారు సొంతంగా వ్యాపారం చేసుకునేలా ఆంధ్రప్రదేశ్...

5 రోజుల్లో 4 రాష్ట్రాలు.. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు సాధిక్ అరెస్ట్

రాజమండ్రి రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి నుంచి గోదావరిలో దూకి పిఠాపురం...

గవర్నమెంట్ హాస్టల్స్‌లో సకల సౌకర్యాలు.. స్టూడెంట్స్‌ హాయిగా చదువుకోవచ్చు!

ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు...

విశాఖపట్నానికి రూ. వెయ్యి కోట్లతో తాగునీరు.. గోదావరి నుంచి నేరుగా నగరానికి

వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్టణానికి భవిష్యత్‌లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర...