నియమ నిష్ఠలతో అమ్మవారి సేవలో…

Date:

సికింద్రాబాద్: లష్కర్‌ బోనాల పండుగ అంటే సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు. ఈ పండుగకు నగరం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా అమ్మవారి దర్శనార్ధం భక్తులు వస్తుంటారు. సంప్రదాయబద్ధంగా కొనసాగే ఈ ఉత్సవాల్లో పలు వృత్తులవారు, కులాలవారు సేవలందించడం ఆనవాయితీగా వస్తోంది. సంవత్సరమంతా ఎక్కడ ఉన్నా ఈ ఆషాఢ మాసం మొదలయిందంటే అమ్మవారి సేవకు ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో తమ పనుల్లో నిమగ్నమవుతారు.

అమ్మవారికి పలు కులాల వారు తమకు తోచిన విధంగా సేవలందిస్తుంటారు. అందులో ప్రధానంగా బ్రాహ్మణ, ముదిరాజ్‌, కుమ్మరి, చాకలి ఇలా పలు కులాలవారు సేవలు చేస్తుంటారు. పదిహేను సంవత్సరాలుగా పోతరాజుగా అమ్మవారికి సేవ చేస్తున్నా. సురిటి కామేశ్వర్‌ ముదిరాజ్‌ ఈ అవకాశం కల్పించారు. గతంలో పోతరాజు దినే్‌షతో కలిసి సేవ చేసేవాడిని. ప్రస్తుతం దేవరాజ్‌, నర్సింగ్‌, భాస్కర్‌లతో కలిసి పోతరాజులుగా సేవలందిస్తున్నాం.

అమ్మవారి ఘటోత్సవం రోజు అమ్మవారిని ఆలయానికి తీసుకువచ్చినప్పటి నుంచి భవిష్యవాణి అనంతరం అమ్మవారిని సాగనంపే వరకు సేవలు అందిస్తుంటాం. ఏ రోజు, ఏ బస్తీలో ఘటం వస్తుందో ఆ రోజు తెల్లవారుజామునే డప్పు వాయిస్తూ అమ్మవారి రాకను అందరికీ తెలిసేలా చేస్తుంటా. దీంతో బస్తీవాసులు అమ్మవారి రాకకు ఎదురుచూస్తుంటారు. ఘటం రూపంలో అమ్మరాగానే సాకలు పోసి, ఒడి బియ్యాన్ని భక్తులు సమర్పిస్తుంటారు. నాలుగు తరాలుగా అమ్మవారికి మా వంశం ఈ సేవలను అందిస్తుంది.

దాదాపు 50 ఏళ్లుగా వంశపారంపర్యంగా అమ్మవారి సేవలో మా కుటుంబం కొనసాగుతుంది. మా తాత, మా తండ్రి అమ్మవారి సేవలో కొనసాగేవారు. మేము ఘటం వెంట తిరిగి ఒడి బియ్యాన్ని సేకరిస్తాం. రంగం రోజు ముందుగా బలిగంపకు అవసరమయ్యే వస్త్రాలు, జల్లకడవను తీసుకువస్తాం. మా తండ్రి తదనంతరం గత సంవత్సరం నుంచి నేనే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నా.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...