మార్వెల్ నుంచి మాస్ సర్‌ప్రైజ్.. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ వైరల్!

Date:

హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వస్తున్న ప్రతి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. తాజాగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను మార్వెల్ విడుదల చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన రూసో బ్రదర్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్‌లో కనిపించిన అద్భుతమైన విజువల్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ ఈసారి ఐరన్ మ్యాన్‌గా కాకుండా ప్రముఖ విలన్ డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే క్రిస్ హెమ్స్‌వర్త్, ఆంథోనీ మాకీ, వనెస్సా కిర్బీ, సెబాస్టియన్ స్టాన్, లెటీషియా రైట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రం 2026 డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారత్‌లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...