
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47’. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట అక్టోబర్ 2న విడుదల కావాల్సిన ఈ మూవీ.. కొన్ని కారణాలతో వారం రోజులు వాయిదా పడింది. దీంతో అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సెప్టెంబర్ 22న ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే సినిమా రిలీజ్ డేట్ మారడంతో పాట విడుదల కూడా వాయిదా పడింది. అప్పటి నుంచి సాంగ్ కోసం వెంకీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ‘నారాయణమ్మ’ పాటను సెప్టెంబర్ 27న అంటే నేడు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఈ సాంగ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈసారైనా పాట అనుకున్న సమయానికి విడుదలవుతుందా? అనేది చూడాలి.
ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు.
