
హీరోగా, దర్శకుడిగా వరుస వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓం’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.
నవంబర్ 20కి వాయిదా..
ఇటీవల విడుదలైన ‘ఓం’ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ముందుగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల విడుదల తేదీని మార్చినట్లు తెలుస్తోంది. తాజాగా నవంబర్ 20న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
కొత్త లుక్‌తో ఆసక్తి పెంచిన టీమ్
రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్టర్‌ను కూడా పంచుకుంది. “అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది” అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన ఈ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
‘ఓం’ చిత్రాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ధనుష్, మమ్ముట్టి వంటి క్రేజీ కాంబినేషన్‌తో పాటు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
