‘ధురంధర్’ 4 రోజుల్లో భారీ వసూళ్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రణవీర్ సింగ్

Date:

బాలీవుడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం, కేవలం నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రణవీర్ సింగ్ పవర్‌ఫుల్ నటన, దర్శకుడు ఆదిత్య ధర్ స్టైలిష్ మేకింగ్ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన నాలుగు రోజుల అధికారిక కలెక్షన్స్‌ను జియో స్టూడియోస్ విడుదల చేసింది. భారతదేశంలో మొదటి రోజే రూ.145 కోట్ల గ్రాండ్ ఓపెనింగ్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు రూ.83 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్‌తో రూ.117 కోట్లు రాబట్టగా, నాలుగో రోజు (ఆదివారం) రూ.121 కోట్లతో మరోసారి రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు చేసింది.

దీంతో కేవలం ఇండియాలోనే ఈ చిత్రం రూ.466 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ముఖ్యంగా వర్కింగ్ డేస్‌లో కూడా కలెక్షన్స్ స్థిరంగా ఉండటం ఈ సినిమాకు ఉన్న బలమైన బాక్సాఫీస్ స్టామినాను సూచిస్తోంది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘ధురంధర్’ అదే జోరు కొనసాగిస్తోంది. విదేశాల్లో ఇప్పటివరకు రూ.211 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.

మొత్తంగా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.761 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం, త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరే దిశగా దూసుకుపోతోంది. 2026లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఇప్పటికే రికార్డు సృష్టించింది.

ఇండియన్ మార్కెట్ నుంచే రూ.550 కోట్లకు చేరువలో వసూళ్లు సాధించడం ‘ధురంధర్’ క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, లాంగ్ రన్‌లో ఈ సినిమా రూ.2000 కోట్ల మార్క్‌ను కూడా అందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...