ప్రేమ పెళ్లి.. మరో మహిళతో ఎఫైర్.. అత్త అడ్డుగా ఉందని దారుణ హత్య!

Date:

తెలంగాణలోని సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో వెంకట నరసమ్మ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఆమె అల్లుడు తిరుపతిరావే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మహిళ సునీతతో తిరుపతిరావు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఈ వ్యవహారానికి అత్త వెంకట నరసమ్మ అడ్డుగా ఉందని భావించి ఆమెను హత్య చేసినట్లు తెలిపారు.

హత్య అనంతరం నిందితుడు మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి గ్రామ శివారులోని ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ పెట్రోల్‌ పోసి మృతదేహాన్ని తగలబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కేసులో తిరుపతిరావుతో పాటు మరో మహిళ సునీత పాత్రపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్నాడు.. ఆ తర్వాత మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.. అంతా బాగానే ఉందనుకున్న క్రమంలో ఈ విషయం భార్యతోపాటు.. అత్త వారింట్లో తెలిసింది.. అల్లుడు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసి ఆ అత్త నిలదీసింది.. ప్రేమ వివాహం చేసుకున్న తన కూతురు కాపురం బాగుండాలని అల్లుడ్ని హెచ్చరించింది. కానీ అతడిలో ఎంతకీ మార్పు రాకపోవడంతో గ్రామ పెద్దల ముందు దోషిగా నిలబెట్టింది. అల్లుడు తీరులో మార్పు రాకపోవడంతో భార్య, అత్త గట్టిగా నిలదీయడంతో గొడవ పడ్డాడు. అత్తను అడ్డు తొలగించుకోవాలని అల్లుడు ప్లాన్ వేశాడు.. ఆమెను ఇంట్లోనే హత్య చేసి ఊరి శివారులో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అల్లుడు, ఆమె ప్రియురాలు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు ..

అత్త హత్య మిస్టరీ ఛేదన.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని దారుణం

సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో వృద్ధురాలు వెంకట నరసమ్మ అదృశ్యమైన కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అత్త అడ్డుగా ఉందనే కారణంతో అల్లుడు తిరుపతిరావు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు తెలిపారు. ఈ కేసులో తిరుపతిరావుతో పాటు అతని ప్రియురాలు సునీతను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

తుంబూరు గ్రామానికి చెందిన వెదుల్ల తిరుపతిరావు సుమారు 30 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన గుండాల వెంకట నరసమ్మ పెద్ద కుమార్తె మంగమ్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కరెంట్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే తిరుపతిరావుకు గతంలోనే మరో మహిళతో వివాహం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో కొంతకాలంగా తుంబూరులో ఉంటున్న తిరుపతిరావు.. అదే గ్రామానికి చెందిన మరో వివాహిత మహిళ సునీతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో నరసమ్మ తన అల్లుడిని నిలదీసినట్లు సమాచారం. దీంతో తన సంబంధానికి అత్త అడ్డుగా ఉందని భావించిన తిరుపతిరావు ఆమెను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఈ విషయం భార్య మంగమ్మతో పాటు ఆమె తల్లి వెంకట నరసమ్మకు తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. అల్లుడిని పలుమార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో.. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఈ సందర్భంగా అల్లుడు తిరుపతిరావును అత్త వెంకట నరసమ్మ తీవ్రంగా హెచ్చరించింది. తన కూతురికి అన్యాయం చేస్తూ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడం ఏంటని నిలదీసింది. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన మంగమ్మ కూడా తనకు భర్త వద్దని స్పష్టం చేస్తూ అప్పటికే విడిగా ఉంటోంది.

అయితే పంచాయతీ జరిగిన రెండు రోజులకే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 2వ తేదీ రాత్రి నుంచి వెంకట నరసమ్మ కనిపించకుండా పోయింది. దీంతో తన తల్లి కనిపించడం లేదంటూ మంగమ్మ ఆగస్టు 3న సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వివాహేతర సంబంధానికి అత్త అడ్డుగా ఉందని భావించిన అల్లుడు తిరుపతిరావు, అతని ప్రియురాలు సునీత కలిసి వెంకట నరసమ్మను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరూ కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో టీవీ చూస్తున్న వెంకట నరసమ్మను చీర కొంగుతో గొంతు బిగించి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.

హత్య అనంతరం మృతదేహాన్ని తిరుపతిరావు, సునీత కలిసి బైక్‌పై తరలించారు. నారాయణపురం గుడి దాటిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న ఎండిపోయిన కట్టెలు, కొబ్బరి మట్టలను మృతదేహంపై వేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే మరుసటి రోజు ఉదయం వెళ్లి చూడగా మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో.. మళ్లీ కొబ్బరి మట్టలు, చెత్త వేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు.

అయినప్పటికీ మృతదేహంలోని కొన్ని శరీర భాగాలు మిగిలిపోయాయి. దీంతో ఈ నెల 3వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మిగిలిన శరీర భాగాలను ఆకుపచ్చ రంగు గుడ్డ మ్యాట్‌లో చుట్టి కొంత దూరం తరలించారు. అక్కడ రోడ్డు పక్కన కొబ్బరి మట్టలు, చెత్తలో వాటిని వేసి మరోసారి పెట్రోల్ పోసి నిప్పంటించారు.

హత్య అనంతరం ఏమీ తెలియనట్లు తిరుపతిరావు కుటుంబ సభ్యులతో కలిసి తిరుగుతూ నటించాడు. అయితే పోలీసులు వివిధ ఆధారాలను సేకరించి, తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అల్లుడు తిరుపతిరావుతో పాటు అతని ప్రియురాలు సునీతను అరెస్టు చేసిన పోలీసులు.. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు సత్తుపల్లి పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...