
ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే భారీ స్థాయి మాత్రమే కాదు.. షూటింగ్‌కు ఎక్కువ సమయం తీసుకుంటారనే పేరూ ఉంది. ‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు సుదీర్ఘంగా చిత్రీకరణ జరగడమే ఇందుకు ఉదాహరణ. అయితే సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ విషయంలో మాత్రం జక్కన్న తన గత సినిమాలకు భిన్నంగా వేగంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
606 రోజుల్లో మేజర్ షూటింగ్ పూర్తి
‘వారణాసి’ షూటింగ్ ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తయినట్లు రాజమౌళి వెల్లడించారు. సెప్టెంబర్ 28న జరిగిన ప్రత్యేక క్యూ అండ్ ఏ సెషన్లో సినిమా గురించి ఆయన పలు విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా షూటింగ్ వేగం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాజమౌళి గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ దాదాపు 1011 రోజుల పాటు సాగింది. 2018 నవంబర్ 19న ప్రారంభమైన ఆ సినిమా షూటింగ్ 2021 ఆగస్టు 26న పూర్తైంది. అయితే ‘వారణాసి’ మేజర్ షూటింగ్‌ను సుమారు 606 రోజుల్లోనే పూర్తి చేసినట్లు సమాచారం. 2025 జనవరి 24న మొదలైన చిత్రీకరణ.. 2026 సెప్టెంబర్ 22 నాటికి పూర్తయినట్లు తెలుస్తోంది.
భారీ సినిమా.. ఇంత వేగంగా?
భారీ యాక్షన్ సన్నివేశాలు, అంతర్జాతీయ స్థాయి విజువల్స్, భారీ సెట్స్‌తో ‘వారణాసి’ని రూపొందిస్తున్నారు. ఇంత భారీ ప్రాజెక్ట్‌ను తక్కువ సమయంలో షూట్ చేయడం అభిమానులు, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మిగిలిన చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్, ఇతర నిర్మాణ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
మహేశ్ బాబు లుక్, రాజమౌళి టేకింగ్, భారీ నిర్మాణ విలువలు ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్టార్ కాస్ట్‌తో భారీ అంచనాలు
‘వారణాసి’లో మహేశ్ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
