హైదరాబాద్‌లో ఏనుగు దంతాల అక్రమ విక్రయానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అడ్డుకట్ట వేశారు. ముందస్తు సమాచారంతో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు.. ఏనుగు దంతాల విక్రయానికి సంబంధించిన లావాదేవీ జరుగుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం నాలుగు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఏనుగు దంతాల అక్రమ విక్రయాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అడ్డుకున్నారు. నిర్దిష్ట సమాచారం ఆధారంగా నిఘా ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు.. ఏనుగు దంతాల విక్రయానికి సంబంధించిన లావాదేవీ జరుగుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి నాలుగు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు సుమారు 17 కిలోలుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

అదే సమయంలో దంతాలతో తయారు చేసిన పలు ఐవరీ వస్తువులు, ట్రోఫీలను కూడా అధికారులు సీజ్ చేశారు. ఏనుగు దంతాల అక్రమ విక్రయంపై సమాచారం అందుకున్న DRI బృందాలు ముందస్తు నిఘా ఏర్పాటు చేసి.. లావాదేవీ జరుగుతున్న ప్రాంతంలో వలపన్ని నిందితులను పట్టుకున్నాయి. అనంతరం స్వాధీనం చేసుకున్న దంతాలు, ఐవరీ వస్తువులను చట్ట ప్రకారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్, 1972లోని సంబంధిత నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏనుగు దంతాలను అక్రమంగా కొనుగోలు చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం లేదా వాటితో తయారు చేసిన వస్తువులను అక్రమంగా రవాణా చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

వన్యప్రాణుల అక్రమ రవాణా, రక్షిత జంతువుల అవయవాలు, ట్రోఫీల అక్రమ వ్యాపారంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) దేశవ్యాప్తంగా నిఘా కొనసాగిస్తోంది. ఇంటెలిజెన్స్ ఆధారంగా చేపడుతున్న ఆపరేషన్లలో భాగంగానే హైదరాబాద్‌లో తాజా దాడి నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఏనుగు దంతాల మూలం, నిందితుల వెనుక ఉన్న నెట్‌వర్క్, అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఇతర అంశాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.