రికార్డు స్థాయికి రైతు భరోసా.. కొత్తగా 15 లక్షల మంది రైతులకు లబ్ధి, అనర్హుల ఏరివేతపై సర్కార్ ఫోకస్

Date:

తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో పథకాన్ని అమలు చేయగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.12 వేలు రెండు విడతల్లో సాయం అందిస్తున్నారు. ఈ పథకం తాజాగా సరికొత్త మైలురాయిని అధిగమించింది. 2018 నుంచి ఇప్పటివరకు 15 లక్షల మంది కొత్త లబ్ధిదారులను చేర్చుకుంటూ రూ. 73,320 కోట్ల సాయానికి చేరుకుంది. గతంలో 58 లక్షలుగా ఉన్న లబ్ధిదారుల సంఖ్య.. కౌలు రైతులు, 9 లక్షల మంది వ్యవసాయ కూలీల చేరికతో 73 లక్షలకు చేరింది.

తెలంగాణలోని రైతులను ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సరికొత్త మైలురాయిని అధిగమించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధుగా ప్రారంభమై.. ప్రస్తుతం రైతు భరోసాగా కొనసాగుతున్న ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు అందించిన మొత్తం నిధుల పంపిణీ ఏకంగా 46 శాతం పెరిగి రూ. 73,320 కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం.. 2018లో ఈ పథకం ప్రారంభమైనప్పుడు కేవలం భూమి ఉన్న సుమారు 58 లక్షల మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందేది. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పరిధిని మరింత విస్తృతం చేస్తూ అర్హులైన వ్యవసాయ కూలీలను, కౌలు రైతులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసింది. దీనివల్ల ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 73 లక్షల మార్కును దాటింది

ఈ మొత్తం వ్యయంలో 2018 నుంచి 2023 వరకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 50,250 కోట్లు పంపిణీ చేయగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు మరో రూ. 23,070 కోట్లను విజయవంతంగా విడుదల చేసింది. కింద సుమారు 9 లక్షల మంది నిరుపేద వ్యవసాయ కూలీలను చేర్చారు. గతంలో భూమి ఉన్నవారికే సాయం దక్కే విధానం ఉండగా.. ఇప్పుడు నిజమైన కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థిక అండ లభిస్తోంది. దీనివల్ల రాష్ట్ర బడ్జెట్‌పై వార్షిక భారం పెరిగినప్పటికీ, నిరుపేద రైతులకు నేరుగా నగదు బదిలీ జరుగుతోందని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా వారీగా పరిశీలిస్తే, అత్యధికంగా నల్గొండ జిల్లాకు రూ. 5,491 కోట్ల గరిష్ట నిధులు అందగా.. ఆ తర్వాత స్థానాల్లో సంగారెడ్డి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాలు నిలిచాయి. అత్యల్పంగా వ్యవసాయ భూములు లేని హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...