తెలంగాణలో కొత్తగా 100 పబ్లిక్ స్కూళ్లు.. ఆరుట్ల టీపీఎస్ తరహాలో.. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే సౌకర్యాలు..!

Date:

ప్రభుత్వ ఉద్యోగం కావాలి. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి, సర్కారు బడుల్లో పిల్లలను చదివించడానికి వెనుకాడుతుంటారు. సౌలతులు ఉండవని, పాఠాలు సరిగా చెప్పరని.. ఇలా రకరకాల కారణాలు చెబుతుంటారు. ఈ పరిస్థితిని మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ కసరత్తే చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని సర్కారు దావఖానాల రూపురేఖలు మారాయి. ప్రభుత్వ హాస్పిటళ్లలోనే కార్పొరేట్‌కు దీటుగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అదే సమయంలో విద్యా రంగంలోనూ మంచి మార్పు దిశగా రేవంత్ రెడ్డి సర్కారు అడుగులేస్తోంది

తెలంగాణలోని 100 నియోజకవర్గాల్లో పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామంలో ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వ పాఠశాల తరహాలోనే కొత్త స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి ప్రతి మండలంలో కనీసం రెండు స్కూళ్లను పబ్లిక్ స్కూళ్లుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో మొదటి అడుగుగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..

యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది....

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్.. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్...

ఆరుగురిని చంపిన హంత‌కుడికి అనాథ‌లా అంత్య‌క్రియ‌లు.. కుటుంబ సభ్యులు వద్దనడంతో.. ఎవరు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఆరుగురుని అతికిరాతకంగా చంపిన కిరాతక...

సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు.. ఏడాది జైలుశిక్ష పడే అవకాశం ఉందా?

రాష్ట్రంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా.....