వెలగపూడి అమరావతిలోని శాసన మండలి హాల్లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 50వ సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు చర్చిస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రశ్నోత్తరాలు, వివిధ అంశాలపై చర్చలు, వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు.


