జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 6 : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఆకాంక్షతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జంగారెడ్డిగూడెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో మహా వరుణ యాగాన్ని నిర్వహించారు. ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడకుండా, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మేలు జరగాలనే సంకల్పంతో వేద పండితుల ఆధ్వర్యంలో యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో వరుణ యాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల ముఖాల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ యాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ, కూటమి నాయకులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.

By Ramya