
తుకారాం ముండే.. ఈ పేరు వినగానే మహారాష్ట్రలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాల నిర్వాహకుల్లో గుబులు మొదలవుతోంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార సంస్థలపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కొరడా ఝుళిపిస్తోంది.
FDA కమిషనర్‌గా తుకారాం ముండే ఆకస్మిక తనిఖీలతో అక్రమాలకు పాల్పడుతున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాలను వదిలిపెట్టకుండా చర్యలు చేపడుతుండటంతో ఆయనకు ‘ఐఏఎస్ సింగం’ అనే పేరు వచ్చింది.
ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ముండే చేపడుతున్న దూకుడైన చర్యలు ఇప్పుడు మహారాష్ట్రకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. విధి నిర్వహణలో ఆయన చూపిస్తున్న నిబద్ధత, అక్రమాలపై రాజీపడని వైఖరి మరోసారి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలిచింది.
నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ స్టోర్ల పాలిట సింహస్వప్నంగా మారిన మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, ఐఏఎస్ అధికారి తుకారాం ముండే పేరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ మార్మోగుతోంది. ఆకస్మిక తనిఖీలతో నిబంధనలను ఉల్లంఘించే ఆహార సంస్థలపై కొరడా ఝళిపిస్తున్న ముండేను ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఏకంగా ‘రాక్‌స్టార్’గా అభివర్ణించింది.
‘ఇన్ ఇండియా, ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఈజ్ ఏ రాక్‌స్టార్’ అనే శీర్షికతో ముండేపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్.. ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణ, రెస్టారెంట్ యజమానుల్లో నెలకొన్న భయాన్ని కూడా ప్రస్తావించింది. ‘డైనర్స్ రెవర్ హిమ్ అండ్ ఓనర్స్ ఫియర్ హిమ్’ అంటూ ఆయన పట్ల ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారుల్లో ఉన్న ఆందోళనను వివరించింది. అంతేకాదు.. ముండేను ‘ఫుడ్ సేఫ్టీ సెలబ్రిటీ’గా పేర్కొనడం విశేషం.
హోటళ్లు, రెస్టారెంట్లు, గోదాములు, ఫుడ్ స్టోర్లు సహా వివిధ ఆహార విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు తుకారాం ముండే. తనిఖీల్లో అపరిశుభ్ర పరిస్థితులు, కిచెన్లలో బొద్దింకలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు వంటి ఉల్లంఘనలు గుర్తించిన సందర్భాల్లో వెంటనే చర్యలు చేపట్టారు.
ఇలాంటి తనిఖీల్లో భాగంగా ‘డొమినోస్’, ‘పిజ్జా హట్’కు చెందిన కొన్ని ఔట్లెట్లపై కూడా చర్యలు తీసుకుని తాత్కాలికంగా మూసివేశారు. ముంబయిలోని ప్రముఖ పాతకాలపు ఆహార వ్యాపార సంస్థల లైసెన్సుల విషయంలోనూ నిబంధనలను కఠినంగా అమలు చేశారు.
అక్రమాలు, నిర్లక్ష్యంపై ఏమాత్రం రాజీపడకుండా విధులు నిర్వర్తిస్తుండటంతో తుకారాం ముండేకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆయన దూకుడైన కార్యాచరణ కారణంగానే ‘ఐఏఎస్ సింగం’గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా సైతం ఆయనను ‘రాక్‌స్టార్’, ‘ఫుడ్ సేఫ్టీ సెలబ్రిటీ’గా అభివర్ణించడంతో ముండే పేరు మరింతగా మార్మోగుతోంది.
క్విక్ కామర్స్ సంస్థలైన బ్లింకిట్, జెప్టోకు చెందిన డార్క్ స్టోర్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బల్లులు, బొద్దింకలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు పలు కథనాలు వెలువడ్డాయి.
రెస్టారెంట్లు, హోటళ్లలో పారిశుద్ధ్య ప్రమాణాల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్న తుకారాం ముండేకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పేరు అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. ‘ఐఏఎస్ సింగం’గా పేరొందిన తుకారాం ముండేను ‘న్యూయార్క్ టైమ్స్’ ‘రాక్‌స్టార్’గా అభివర్ణించినట్లు వచ్చిన కథనాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఈ ఏడాది మే నుంచి తుకారాం ముండే పారిశుద్ధ్య లోపాలు, ఆహార కల్తీపై విస్తృత స్థాయిలో తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు ఆహార విక్రయ కేంద్రాల్లోనూ తనిఖీలు చేపడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ వరుస తనిఖీలు మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారాయి.
