
విశాఖపట్నం, అక్టోబర్ 6 : విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డులో నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్ఎస్ఎస్-1) మంగళవారం జలప్రవేశం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఎస్-5 నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు భారీ గోలియత్ క్రేన్, స్లిప్‌వే-4ను ప్రారంభించారు.
కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేవీ చీఫ్ తదితరులు హాజరయ్యారు.
సుమారు 43,500 టన్నుల సామర్థ్యం కలిగిన ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లు భారత నావికాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. సముద్రంలోనే యుద్ధనౌకలకు ఇంధనం అందించడంతో పాటు అవసరమైన ఇతర సహాయ సేవలను అందించేందుకు వీటిని వినియోగించనున్నారు. ఈ నౌకల ద్వారా సుదూర సముద్ర కార్యకలాపాల్లో నేవీకి కీలక సహకారం అందనుంది.
