WITT Summit 2026: యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ కీలక వ్యాఖ్యలు

Date:

టీవీ9 భారత్‌వర్ష్ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ కార్యక్రమంలో ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధంపై ఇరాన్ ప్రతినిధి ఇలాహీ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇరాన్ ఎప్పుడూ యుద్ధాన్ని ప్రారంభించలేదని, అది తమపై బలవంతంగా రుద్దబడిందని పేర్కొన్నారు. తాము శాంతిని కోరుకుంటున్నామని. కానీ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్‌లే అన్నారు. యుద్ధాన్ని వారే ప్రారంభించారు కాబట్టి దాన్ని ముగించాల్సింది కూడా వారేనని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ కేవలం తన ఆత్మగౌరవం కోసం, న్యాయం కోసం పోరాడుతోందని చెప్పుకొచ్చారు.

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విమరమణకు వైట్ హౌట్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో యుద్దాన్ని ఎలా ముంగిచాలనే అంశంపై ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ ప్రతిని టీవీ9 భారత్‌వర్ష్‌తో మాట్లాడారు. టీవీ9 భారత్‌వర్ష్‌తో నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. అమెరికాను నమ్మలేమని. దాని చరిత్ర అంతా కలంకితమైందన్నారు. ఇరాన్‌పై దాడులు ఆగనంత వరకు యుద్ధం ముగియదని. ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆపితేనే ఇరాన్ కూడా వెనక్కి తగ్గుతుందన్నారు.

ఒక బలమైన దేశం ఒక బలహీన దేశంపై దాడి చేయడం ఎలా సాధ్యం? ప్రపంచం దీనిని ఎందుకు గమనించడం లేదు? మేము కేవలం ప్రతీకారం తీర్చుకున్నాము. మేము ఒక్క అమాయకుడి రక్తాన్ని కూడా చిందించలేదు అని ఆయన అన్నారు. మొత్తం ప్రపంచానికి శాంతి అత్యవసరమని. మేము మొత్తం మధ్యప్రాచ్యంలో శాంతిని కోరుకుంటున్నామన్నారు. ఇందులో లెబనాన్, గాజాతో పాటు సిరియా కూడా ఉండాలన్నారు. దాని భూభాగాన్ని ఎవరు ఆక్రమించారనే దానిపై మనం చర్చించాలన్నారు.

మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలంటే ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలని ఇలాహీ సూచించారు. భవిష్యత్తులో ఇరాన్‌పై ఎలాంటి దాడులు జరగవని హామీ ఇవ్వాలని. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన పాఠశాలలు, ఆసుపత్రులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇరాన్ తన గౌరవం విషయంలో ఎప్పుడూ రాజీ పడదని. ఒక స్వతంత్ర దేశం తన రక్షణ కోసం ఏం చేయాలో అదే చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...