మమితా బైజు క్రేజ్‌కు హద్దుల్లేవు.. కాల్షీట్స్ కోసం దర్శకుల పోటీ!

Date:

Mamitha Baiju Popularity Soars After Premalu:

రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్న మలయాళ బ్యూటీ మమితా బైజు.. మాలీవుడ్‌లో దాదాపు 15 సినిమాలు చేసినా రాని గుర్తింపు *Premalu*తో ఒక్కసారిగా దక్కించుకుంది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో.. పక్కనే ఉన్న కోలీవుడ్‌పై మమితా దృష్టి సారించింది. కొన్ని సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా.. Dude మూవీ హిట్‌తో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. యూత్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో తమిళ దర్శకులు మమితా కాల్షీట్స్ కోసం క్యూ కడుతున్నారు.

Premalu తర్వాత మంచి అవకాశాలు వస్తాయని భావించినా.. ఊహించని విధంగా స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకుంది మమితా. Vijay, Suriya, Dhanush వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం ఆమెకు దక్కింది. విజయ్ నటిస్తున్న Jana Nayagan, సూర్య ప్రాజెక్ట్ Vishwanath and Sons, అలాగే ధనుష్ నటిస్తున్న Kara సినిమాల్లో మమితా కీలక పాత్రలు పోషిస్తోంది. ఇదే సమయంలో సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ, ప్రతి సినిమాకు భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Jana Nayagan సినిమాలో విజయ్ కుమార్తెగా స్ట్రాంగ్ గర్ల్ పాత్రలో కనిపించనుంది. మరోవైపు Vishwanath and Sonsలో పూర్తిగా విభిన్నమైన రోల్ చేస్తోంది. తనకంటే 20 ఏళ్లు పెద్ద వ్యక్తిని ప్రేమించే, అతని ప్రేమ కోసం తపించే నాటీ గర్ల్ పాత్రలో నటించబోతోంది. ఇక ధనుష్ నటిస్తున్న Kara సినిమాలో పూర్తిగా పల్లెటూరి అమ్మాయిగా, డీ-గ్లామర్ లుక్‌లో కనిపించనుంది.

అలాగే Vishnu Vishal నటిస్తున్న Irundu Vaanam ఒక ప్యూర్ లవ్ స్టోరీగా రానుంది. ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో షేడ్ చూపిస్తూ, ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో పోషించగలనని మమితా బైజు నిరూపిస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...