
విజయవాడలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0, పున్నమిఘాట్లో సరస్ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరానికి భారీగా భక్తులు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు.
భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు
- హైదరాబాద్ నుంచి చెన్నై: ఇబ్రహీంపట్నం, నల్లకుంట, విజయవాడ బైపాస్, వెంకటపాలెం టోల్‌ప్లాజా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా వెళ్లాలి.
- ఏలూరు నుంచి చెన్నై: చిన్నఆవుటపల్లి, విజయవాడ బైపాస్, వెదురుపావులూరు టోల్‌ప్లాజా, నల్లకుంట, వెంకటపాలెం టోల్‌ప్లాజా, కాజ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా వెళ్లాలి.
- చెన్నై నుంచి హైదరాబాద్: నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కాజ, విజయవాడ బైపాస్, వెంకటపాలెం టోల్‌ప్లాజా, నల్లకుంట, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లాలి.
- చెన్నై నుంచి ఏలూరు: నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కాజ, విజయవాడ బైపాస్, వెంకటపాలెం టోల్‌ప్లాజా, నల్లకుంట, వెదురుపావులూరు టోల్‌ప్లాజా, చిన్నఆవుటపల్లి మీదుగా వెళ్లాలి.
- చెన్నై నుంచి మచిలీపట్నం: నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కాజ, విజయవాడ బైపాస్, నల్లకుంట, వెదురుపావులూరు టోల్‌ప్లాజా, చిన్నఆవుటపల్లి, కేసరపల్లి, ఉప్పులూరు, కంకిపాడు, ఉయ్యూరు మీదుగా వెళ్లాలి.
- మచిలీపట్నం నుంచి ఒంగోలు: తాడిగడప 100 అడుగుల రోడ్డు, ఎనికేపాడు, గన్నవరం, చిన్నఆవుటపల్లి, విజయవాడ బైపాస్, నల్లకుంట, వెంకటపాలెం టోల్‌ప్లాజా, కాజ, గుంటూరు మీదుగా వెళ్లాలి.
దసరా ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని, పోలీసుల సూచనలకు సహకరించాలని అధికారులు కోరారు.
