Andhra Pradesh: ఘోర ప్రమాదం కాలిబూడిదైన ట్రావెల్స్ బస్సు.. 10మంది సజీవ దహనం

Date:

మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు‌ను టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో బస్సు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనలో 10 మంది సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారన్న దాని స్పష్టత రావల్సి ఉంది.

క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు చీమకుర్తి నుంచి కంకర తీసుకొస్తున్న టిప్పర్ ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తి దగ్ధమయ్యాయి.

హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 10 మంది కాలిబూడిదయ్యారు. మరో 12 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. కాగా, దాదాపు 20మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

ఈ సంఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చే లోపే వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎక్కువ గా కనిగిరి, పామూరు ప్రాంత వాసులుగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు గాయపడ్డవారిని, అంబులెన్స్ లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి...

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ...

ప్రేమలో ‘బుట్టబొమ్మ’.. బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్?..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు గత కొన్ని...