MSME Vizag Admissions 2026: ఎంఎస్‌ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ టెన్త్‌ విద్యార్ధులకు ఛాన్స్‌

Date:

MSME Vizag Admissions 2026: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం టెక్నాలజీ సెంటర్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడేళ్ల అడ్వాన్స్‌డ్‌ డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌, మెకట్రానిక్స్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ.

భారత ప్రభుత్వ రంగ సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధికి చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం టెక్నాలజీ సెంటర్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడేళ్ల అడ్వాన్స్‌డ్‌ డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌, మెకట్రానిక్స్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 30, 2026వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు కేటాయిస్తారు. విశాఖపట్నంలోని ఎంఎస్‌ఎంఈలో మొత్తం 120 సీట్లు ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో 60 సీట్లు డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్‌ డై అండ్‌ మౌల్డ్ మేకింగ్ (డీఏడీడీఎంఎం) కోర్సుకు, మరో 60 సీట్లు డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్‌ మెకట్రానిక్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ (డీఏఎంఐఏ) కోర్సుకు కేటాయిస్తారు. కోర్సు వ్యవధి మూడేళ్లు.

ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో పాసైన సరిపోతుంది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2026 నాటికి 22 ఏళ్లకు మించకూడదు.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హలు కలిగిన వారు ఏప్రిల్ 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ /ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మే 3న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధారంలో అబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఉంటుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Women and Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? వైద్యులు చెబుతున్న కారణాలివే!

థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ జీవక్రియ, శక్తి...

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...