ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఫస్ట్ పోస్ట్ ఏంటో చూశారా?

Date:

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా చాలా రిజర్వ్ డ్ గా ఉంటారు. మరీ ముఖ్యమైన ఫంక్షన్లు, ఈవెంట్స్ ఉంటే తప్ప ఆమె పెద్దగా బయటకు రారు. ఇక కాసేపటి క్రితం వరకు ఆమెకు ఎలాంటి అధికారిక సోషల్ మీడియా ఖాతాలు కూడా లేవు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా ఎట్ట‌కేల‌కు సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. బుధవారం (మార్చి 25) anna.konidala పేరుతో అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ప‌వ‌న్ తో దిగిన ఒక క్యూట్ ఫొటోను షేర్ చేసిన అన్నా లెజినోవా.. ‘చాలా కాలం నుంచి ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాను. అందుకు ఇదే సరైన సమయం అనిపించింది.

మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో , పవన్ కల్యాణ్ సపోర్టు తో మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని తన పోస్టులో రాసుకొచ్చారు. ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఆమె తన కుటుంబ సభ్యులతో పాటు, ఇతర సెలబ్రిటీలను కూడా అనుసరించింది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ , సమంత, అలియా భట్ తదితర స్టార్స్ కూడా ఉన్నారు.

ఇక పవన్ కల్యాణ్ కూడా తన భార్యకు స్వాగతం చెబుతూ ఇన్ స్టా గ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు.. ‘అన్నా లెజినోవా’ కి మనస్ఫూర్తిగా ఇన్ స్టాగ్రామ్ లోకి స్వాగతం పలుకుతున్నాను. ఈ స్పేస్ లోకి వచ్చినందుకు మీకు ఆల్ ది బెస్ట్. రాబోయే రోజుల్లో నీ విలువైన ఆలోచనలను ఈ స్పేస్ ద్వారా ఎలా పంచుకోబోతున్నావో తెలుసుకోవాలని నాకు కూడా కుతూహలంగా ఉంది’ అని రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.

కాగా అన్నా లెజినోవా షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. ఆమె అలా ఇన్ స్టా గ్రామ్ ఖాతా ఓపెన్ చేసిందో లేదు కానీ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇప్పటివరకు సుమారు 157K (ఒక లక్ష 57 వేల మంది) అన్నా లెజినోవాను ఫాలో అవుతున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..

యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది....

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్.. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్...

ఆరుగురిని చంపిన హంత‌కుడికి అనాథ‌లా అంత్య‌క్రియ‌లు.. కుటుంబ సభ్యులు వద్దనడంతో.. ఎవరు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఆరుగురుని అతికిరాతకంగా చంపిన కిరాతక...

సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు.. ఏడాది జైలుశిక్ష పడే అవకాశం ఉందా?

రాష్ట్రంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా.....