Ram Charan : పెద్ది షూటింగ్‏లో ప్రమాదం రామ్ చరణ్‏కు గాయాలు స్పందించిన పవన్ కళ్యాణ్..

Date:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణల సమయంలో చరణ్ కంటి సమీపంలో స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో పెద్ది చిత్రీకరణకు బ్రేక్ పడింది. చరణ్ కు చిన్న గాయమేనని. దీనిపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్రయూనిట్ స్పష్టం చేసింది. తాజాగా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వ్సతున్న ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్, కిలారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ పక్కా ఊర మాస్ లుక్కులో కనిపించనున్నారు. ఇదివరకు విడుదలైన గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. మరోవైపు పెద్ది చిత్రంలోని సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. చికిరి చికిరి, రైరై రారా పాటలకు నెట్టింట ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

అయితే హైదరాబాద్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో చరణ్ కు చిన్నపాటి ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన కంటి సమీపంలో స్వల్ప గాయమైందని తెలు్సతోంది. ఈ వార్త బయటకు రావడంతో అటు మెగా అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే చిత్రయూనిట్ స్పందిస్తూ. ఇది కేవలం చిన్న గాయమేనని.

అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వైద్యుల సూచన మేరకు చరణ్ రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నారని. అందుకే షూటింగ్ కు చిన్న బ్రేక్ వచ్చిందని. చరణ్ మళ్లీ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...