
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడకముందే కూటమి ప్రభుత్వం 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం స్థానాల్లో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, జనరల్ మహిళలకు 5, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 4 స్థానాలను కేటాయించింది.
ఏ నగరానికి ఏ రిజర్వేషన్?
మంగళగిరి–తాడేపల్లి మేయర్ స్థానాన్ని ఎస్టీలకు, రాజమహేంద్రవరం, కర్నూలు స్థానాలను ఎస్సీలకు కేటాయించారు. మచిలీపట్నం, కాకినాడ మేయర్ స్థానాలు బీసీ మహిళలకు, ఏలూరు, అనంతపురం, చిత్తూరు స్థానాలు బీసీలకు రిజర్వు చేశారు.
విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖపట్నం మేయర్ స్థానాలను జనరల్ మహిళలకు కేటాయించారు. తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు స్థానాలను అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంచారు.
