
నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ విజయవాడ గొప్పతనాన్ని కొనియాడారు. ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తనదైన శైలిలో ప్రసంగిస్తూ అక్కడి వారిని ఆకట్టుకున్నారు.
విజయవాడలోనే ప్రత్యేక ప్రతిభ
సినిమా రంగానికి విజయవాడ ఎంతో కీలకమని బండ్ల గణేశ్ అన్నారు. సినిమా పుట్టుకకు, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఈ నగరం ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు. కళామ్మతల్లికి విజయవాడ పుట్టినిల్లని అభివర్ణించారు. ఈ ప్రాంతపు మట్టిలోనే ప్రత్యేకమైన ప్రతిభ ఉందని చెబుతూ నగరంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
