ఏపీ, తెలంగాణలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తుండగా.. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడ్రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.

మూడ్రోజుల పాటు వర్షాలు
కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల గరిష్టముగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణకు వర్షసూచన
నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు (అక్టోబర్ 21, 2026) ఉదయం 05:30 గంటలకు అదే ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈరోజు ఉదయం 08:30 గంటలకు కూడా అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంలోని అల్పపీడన కేంద్రం నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్, దానిని ఆనుకుని ఉన్న థాయ్లాండ్, మయన్మార్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు అక్టోబర్ 21 ఉదయం 08:30 గంటలకు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. ఇది ఈరోజు అక్టోబర్ 21 నాటికి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుంది. దీని ప్రభావంతో 2026 అక్టోబర్ 23 నాటికి ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది వాయువ్య దిశగా కదిలి తదుపరి 3 రోజుల్లో మరింత తీవ్రపడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడ్రోజలు పాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
