
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత, ఐక్యత కోసం అమిత్ షా చేస్తున్న కృషిని కొనియాడారు. ఆయన నాయకత్వం, దేశ సేవ పట్ల అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తమ శుభాకాంక్షలను తెలియజేశారు.
చంద్రబాబు అభినందనలు
అమిత్ షా బలమైన నాయకత్వాన్ని, దేశ భద్రత కోసం ఆయన చేస్తున్న అవిశ్రాంత కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. దేశ భద్రత, ఐక్యత పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అమిత్ షా ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని దేశ సేవలో మరెన్నో సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షించారు.
నారా లోకేశ్ శుభాకాంక్షలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని సురక్షితంగా ఉంచాలన్న ఆయన సంకల్పం, సమైక్య భారత్ కోసం చేస్తున్న నిరంతర కృషి లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమిత్ షా అందిస్తున్న నిరంతర సహకారానికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, సంతోషం కలగాలని, దేశ సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
