అమరావతి అజరామరం.. జగన్ ఒక్క ఇటుకను కూడా తాకలేడు: నారా లోకేష్

Date:

అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపటంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. అమరావతి బిల్లుపై చర్చను తాను టీవీలో చూశానన్న లోకేష్.. ఆ సమయంలో ఉద్వేగంతో రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొన్నారు. అమరావతి అజరామరమన్న నారా లోకేష్.. వైఎస్ జగన్ అమరావతిలో ఒక్క ఇటుకను కూడా తాకలేడంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు నారా లోకేష్.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లు ప్రవేశపెట్టగా.. సుమారుగా రెండు గంటల చర్చ అనంతరం లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్‌సభ ఆమోదం పొందిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందంటూ సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. నా రాజధాని అమరావతి అజరామరం అంటూ నారా లోకేష్ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

“ఈ రోజు లోక్‌సభలో అమరావతి రాజధానిగా చట్టబద్థత కల్పించే బిల్లు ఆమోదం పొందుతున్న వేళ, నేను పెమ్మసాని చంద్రశేఖర్ ప్రసంగాన్ని విన్నాను. ఆ సమయంలో నా భావోద్వేగాలను ఆపుకోలేకపోయా. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు. ఇది వేలాది మంది రైతుల త్యాగఫలం. ఓ నమ్మకం, కన్నీళ్లు, మొక్కవోని ధైర్యంపై నిర్మితమైన ఒక స్వప్నం. దేవతల రాజధాని అయిన అమరావతి, ఎన్నో తుఫానులను, ఎన్నో ద్రోహాలను, ఎన్నో సందేహాలను తట్టుకుని నిలబడింది.. ఏనాడూ వెనుకంజ వేయలేదు. అమరావతి కోసం తమ భూమిని, తమ భవిష్యత్తును, తమ నమ్మకాన్ని ఉంచిన ప్రతి రైతుకూ – ఈ క్షణం మీకే అంకితం. మీ త్యాగమే అమరావతిని చిరంజీవిగా నిలిపింది.” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...